ప్లాస్టిక్ సంచుల వాడకంపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ప్లాస్టిక్ సంచుల వినియోగంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్లాస్టిక్ సంచులను ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడేయమన్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్లాస్టిక్ సంచుల వినియోగంపై ఏ విధమైన నియమ నిబంధనలు అమలు చేస్తున్నారని అడిగింది. ప్లాస్టిక్ సంచుల వినియోగంపై అనుసరిస్తున్న విధానాలను ఈ నెల 24వ తేదీ లోగా తెలియజేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్‌లో ప్లాసిక్ సంచుల వినియోగం పెరుగుతోందని, దీని వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని పి. రమాదేవి అనే మహిళ హైకోర్టుకు మొర పెట్టుకుంది. దీంతో విద్యాసాగర్ అనే న్యాయవాదిని హైకోర్టు ఈ కేసులో వాదనకు నియమించింది.












Click it and Unblock the Notifications
