మార్చి 30న తిరుమలలో ఉగాది వేడుకలు
తిరుపతి: తిరుమలలో మార్చి 30న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు సంవత్సరాది నుంచే శ్రీవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆ రోజు విష్వక్సేనుల వారికి ఏకాంత తిరుమంజన సేవ నిర్వహిస్తారు. తర్వాత సర్వభూపాల వాహనంలో సర్వాంగసుంధరంగా అలంకీకృతులై కొలువుదీరిన శ్రీవారు, శ్రీదేవి, భూదేవిలకు ఎడమ వైపు దక్షిణాభిముఖంగా మరో పీఠంపై సేనాధిపతికి స్థానం కల్పించిచి ఉగాది ఆస్థానం పూర్తిచేస్తారు. అనంతరం సర్వదర్శనాకి భక్తులను అనుమతిస్తారు. ఆ రోజు శ్రీవారికి నిర్వహించే సేవలన్ని రద్దు చేశారు.












Click it and Unblock the Notifications
