టిడిపి నేత ఇంట్లో బాంబులు పేలి స్త్రీ మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వెల్తనూరు గ్రామంలోని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి ఇంట్లో నాలుగు బాంబులు పేలాయి. ఈ బాంబు పేలుళ్లలో బీబీ అనే పనిమనిషి మరణించింది. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని గ్రామస్థులు భయపడుతున్నారు.
రామలింగారెడ్డి ఇంట్లో బాంబు పేలుళ్లకు ముందు బుధవారం ఉదయమే 8 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కూడా ఆయన ఇంట్లో పోలీసులు నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామలింగారెడ్డి ఇంట్లో బాంబులను నిల్వ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
