అచరణ లోపాలుంటే అసంతృప్తి తప్పదు: లగడపాటి
విజయవాడ: తనకు రాజకీయ మనుగడ కన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని విజయవాడ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అధికారుల్లో మార్పు రాలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు కావాల్సింది ఓటు రాజకీయాలు కాదని, ప్రజా సమస్యల పరిష్కారం తనకు ముఖ్యమని ఆయన అన్నారు.
ఆచరణ లోపాలుంటే అసంతృప్తి వ్యక్తం చేయడం తప్పు కాదని, అందులో భాగంగానే తాను రెండేళ్ల కాంగ్రెస్ పాలన గురించి అసంతృప్తి వ్యక్తం చేశానని, అధికారుల ధోరణి మారకపోవడం వల్లనే ఆ అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని మరో రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
