ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి చేయవు: వైయస్
గౌహతి: ప్రాంతీయ పార్టీలు అభివృద్ధిని పట్టించుకోవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. అస్సాం ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు ఆయన బుధవారం గౌహతి చేరుకున్నారు. గౌహతి విమానాశ్రయంలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను అధికారానికి దూరంగా ఉంచాలని ఓటర్లను కోరుతానని ఆయన చెప్పారు.
ప్రాంతీయ పార్టీలు మాటలు ఎక్కువ చెప్తాయని, వాటి పాలనలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ మాత్రమే మైనారిటీలకు న్యాయం చేస్తుందని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీల పాలనలో అటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇటు అస్సాంలో గానీ అభివృద్ధి కుంటుపడిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
