తెలంగాణ ఉద్యమానికి వైయస్ దెబ్బ: బిజెపి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. పార్టీ 20 యేళ్ల వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్నమనేని విద్యాసాగరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏడాది పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని ప్రభుత్వ సంస్థలను ముఖ్యమంత్రి దెబ్బ తీస్తున్నారని ఆయన ఆయన విమర్శించారు. ఇందులో భాగంగానే వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములను విక్రయించేందుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
