నాల్గో వన్డేలోనూ గెలుపు: సిరీస్‌ భారత్‌ వశం

కొచ్చి: వరుసగా నాలుగో వన్డేలో గెలిచి భారత్‌ ఇంగ్లాండుపై ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో వన్డేలోనూ విజయంలో యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా ప్రధాన పాత్ర పోషించారు. నాలుగో వన్డేలో ఇంగ్లాండు ఉంచిన 238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ సునాయసంగా విజయాన్ని సాధించింది. ఇంగ్లాండుపై నాలుగో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 2.4 ఓవర్లు మిగిలి వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 4-0 స్కోర్‌తో సిరీస్‌ను గెలుచుకుంది. ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కాస్తా నిలదొక్కుకున్నట్లు కనిపించినప్పటికీ పెద్దగా స్కోర్‌ సాధించలేకపోయాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కాలింగ్‌వుడ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత ద్రావిడ్‌కు జత కూడిన ఇర్ఫాన్‌ పఠాన్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. భారత్‌ 224 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. మహేంద్ర సింగ్‌ ధోనీ, రమేష్‌ పొవార్‌ లాంఛనం పూర్తి చేశారు. 1988 తర్వాత వరసగా ఎనిమిది వన్డేల్లో భారత్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి. వరుసగా 15 వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ ప్రపంచ రికార్డును సృష్టించింది.

సెహ్వాగ్‌తో పాటు ఓపెనర్‌గా దిగిన ద్రావిడ్‌ వన్డేలో 69వ అర్థ సెంచరీ సాధించాడు. ద్రావిడ్‌ 65 పరుగులు చేసి అవుటయ్యాడు. పఠాన్‌ 46 పరుగులు చేశాడు. కైఫ్‌ మరోసారి నిరాశపరిచాడు. సురేష్‌ రైనా భారీ షాట్‌కు ప్రయత్నించి 21 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియన్‌ దారి పట్టాడు. యువరాజ్‌ అర్థసెంచరీ మిస్‌ అయ్యాడు. 48 పరుగుల వద్ద అండర్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. సురేష్‌ రైనా కూడా ఇదే ఓవర్‌లో అండర్సన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్లింటాఫ్‌, అండర్సన్‌, కాలింగ్‌వుడ్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండు పూర్తి 50 ఓవర్లు ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 237 పరుగులకు ఆల్‌ అవుటయ్యింది. పీటర్సన్‌ 77 పరుగులు చేయగా, జోన్స్‌ 49 పరుగులు చేశాడు. కాలింగ్‌వుడ్‌ 36 పరుగులు చేశాడు. యువరాజ్‌, సెహ్వాగ్‌ రెండేసి వికెట్లు తీసుకోగా, పఠాన్‌, శ్రీశాంత్‌, హర్భజన్‌లకు ఒకటేసి వికెట్లు లభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+