షాద్‌నగర్ పరిశ్రమల కాలుష్యంపై హైకోర్టు కొరడా
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ పరిశ్రమల కాలుష్యంపై రాష్ట్ర హైకోర్టు కొరడా ఝళిపించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ స్పాంజ్ ఐరన్ పరిశ్రమల కాలుష్యంపై హైకోర్టు జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పాంజ్ ఐరన్ పరిశ్రమల కాలుష్యంపై రైతులు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.
కాలుష్యం కలిగిస్తున్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమల నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి కేసు విచారణ పూర్తయ్యే వరకు డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్పాంజ్ ఐరన్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి వల్ల పంటలు కోల్పోతున్నామని రైతులు తమ పిటిషన్‌లో ఆరోపించారు. కాలుష్యం వల్ల మంచినీరు కూడా కలుషితమవుతోందని వారన్నారు. నాలుగు మండలాల్లోని గ్రామాలు స్పాంజ్ ఐరన్ కంపెనీల కాలుష్యం బారిన పడుతున్నాయని వారన్నారు.












Click it and Unblock the Notifications
