19 నెంబర్ జీవోపై జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: జీ.వో. నెంబరు 19ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులకు ఆందోళనకు దిగారు. మెడికల్ పి.జి. కౌన్సెలింగ్‌లో అనర్హులైన ఇన్‌సర్వీసువారికి సీట్లు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసిందని, దీని వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని వారు విమర్శిస్తున్నారు. రాత్రికి రాత్రే ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. జీవోను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలోని కెజిహెచ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. గంటూరు తదితర ప్రాంతాల్లో కూడా వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications
