శస్త్ర చికిత్స తర్వాత తిరిగొచ్చిన సచిన్
ముంబాయి: లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న భారత మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ముంబాయికి తిరిగి వచ్చాడు. మార్చి 27వ తేదీన సచిన్‌కు ఆంత్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. సచిన్ బుధవారంనాడే ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఆయన రాకను మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. లండన్‌లోని సెయింట్ జాన్ అండ్ సెయింట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో డాక్టర్ ఆండ్య్రూ వాలస్ సచిన్‌కు శస్త్ర చికిత్స చేశారు.
సచిన్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండుపై జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో సచిన్ కుడి భుజానికి గాయమైంది. దీంతో అతను ఇంగ్లాండుపై జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే సిరీస్ నాటికైనా సచిన్ ఫిట్నెస్ సాధిస్తాడా అనేది అనుమానమే. భారత జట్టు మే 12వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరుతుంది. ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు భారత సెలెక్టర్లు ఈ నెలాఖరున సమావేశమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
