రేణుక సాక్షిగా ఖమ్మం కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
ఖమ్మం: కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సాక్షిగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రేణుకా చౌదరి వర్గీయులు, పాలేరు శాసనసభ్యులు సంభాని చంద్రశేఖర్ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. రేణుకా చౌదరి, సంభాని చంద్రశేఖర్ పరస్పరం వాగ్వివాదానికి జరిగింది. ఈ సంఘటన శనివారంనాడు ఖమ్మం జిల్లా తిరులాయపాలెం మండలంలో జరిగింది. తిరులాయపాలెం మండలంలో వరద కాలువ శంకుస్థాపనకు రేణుకా చౌదరి వస్తున్నారని తెలుసుకున్న చంద్రశేఖర్ వర్గీయులు అక్కడికి పెద్ద యెత్తున చేరుకున్నారు.
ఎమ్మెల్యేకు తెలియజేయకుండా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు వారు నిరసన తెలియజేసేందుకు వచ్చారు. వీరిని అడ్డుకునేందుకు రేణుకా చౌదరి వర్గీయులు ప్రయత్నించారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా తిరుమలాయపాలెం ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడాన్ని నిరసిస్తూ సిపియం కార్యకర్తలు రేణుకా చౌదరిని కారు దిగనీయకుండా అడ్డుకుని ఘెరావ్ చేశారు.












Click it and Unblock the Notifications
