రైతులపై వైయస్ తుపాకి గురి: గద్దర్
హైదరాబాద్: రైతులను ఆదుకుంటామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆ రైతులపైకే తుపాకి ఎక్కుపెట్టారని ప్రజా గాయకుడు గద్దర్ విమర్శించారు. వరంగల్ జిల్లా కొండపర్తిలో, మెదక్ జిల్లా బొప్పాపూర్ గ్రామంలో పోలీసులు సామాన్యులను కాల్చి చంపడాన్ని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల వద్ద ఖండించారు.
రైతులను హత్య చేసిన వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌లపై కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలు ఏది డిమాండ్ చేస్తే అది ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో పోలీసుల గాలింపులు, బూటకపు ఎన్‌కౌంటర్లు నిలిపేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
