ఎమ్యెల్యేపై దాడికి నక్సల్స్ విఫలయత్నం
ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాస రెడ్డిపై మావోయిస్టులు శనివారం దాడికి విఫలయత్నం చేశారు. శ్రీనివాస రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై మావోయిస్టులు బాంబులతో దాడి చేశారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం కాకర్ల గ్రామం వద్ద ఈ దాడి జరిగింది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు మాత్రం ధ్వంసమైంది. మావోయిస్టులు దాడి చేసిన వెంటనే ఎమ్యెల్యే అంగరక్షకులు ఎదురుకాల్పులు జరుపుతూ ఆయనను అక్కడి నుంచి తప్పించారు. ఆయన అక్కడి నుంచి కంభం తీసికెళ్లారు.












Click it and Unblock the Notifications
