నక్సల్స్‌ దాడులకు భయపడవద్దు: వైయస్‌

హైదరాబాద్‌: నక్సల్స్‌ దాడులకు భయపడవద్దని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో శాసనసభ్యుడు ఉడుముల శ్రీనివాస రెడ్డిపై మావోయిస్టులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన శనివారం ఆ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం చేయాల్సిన శాసనసభ్యులు నక్సల్స్‌ దాడులకు భయపడితే ప్రజాస్వామ్యంలో సరి కాదని ఆయన అన్నారు.

ఉడుముల శ్రీనివాసరెడ్డిపై నక్సల్స్‌ దాడికి సంబంధించి పూర్తి సమాచారం అందిన తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. నక్సల్స్‌ పేల్చిన మందుపాతర కొంచెం ముందుగా పేలిందని, దాంతో శ్రీనివాస రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డిపై నక్సల్స్‌ దాడిని ఆయన ఖండించారు. ఎవరికీ భయపడకుండా ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+