కాంగ్రెస్ కన్నా మావోయిస్టులే నయం: బాబు
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యుల కన్నా మావోయిస్టులే నయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మావోయిస్టులు దొంగలు కారని, అధికార కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులే దొంగలని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మంగళవారంనాడు ప్రసంగించారు. కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులు డబ్బులు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు దెబ్బ తింటున్నారని ఆయన అన్నారు. రైతులను ఆదుకోవాలనే ధ్యాస కూడా ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ అరాచకాలపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
