45 రోజుల్లో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ: పవార్
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆరు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. రైతుల ఆత్మహత్యలపై 45 రోజుల్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని, 90 రోజుల్లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు నివేదిక సమర్పిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలతో శరద్‌పవార్ సోమవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం శరద్ పవార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని శరద్ పవార్ అన్నారు. ఈ రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు, ఇందులో ఆంధ్రప్రదేశ్ జిల్లాలే 15 వున్నట్లు కేంద్రం గుర్తించింది. 2001-2005 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 1835 మంది, మహారాష్ట్రలో 981 మంది, కర్ణాటకలో 591 మంది, కేరళలో 2001 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలియజేసింది.












Click it and Unblock the Notifications
