వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జింకల వేట కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
జోథ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు జోథ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, 25వేల జరిమానా విధించింది. సల్మాన్ ఖాన్‌కు సహకరించిన వాచ్‌మన్ గోవింద సింగ్‌కు ఏడాది జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను కోర్టు సోమవారంనాడు దోషిగా నిర్ధారించింది. ఫామ్ హౌస్ వాచ్‌మన్ గోవిందసింగ్‌ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో మరో నలుగురు నిందితులను జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ బ్రిజేంద్ర కుమార్ సింగ్ నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్‌ఖాన్‌కు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయాల్సి వుంది.
జోథ్‌పూర్‌లోని ఫామ్‌హౌస్‌లో 1988లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడడానే ఆరోపణపై కేసు నమోదైంది. చాలా యేళ్లుగా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న సాక్షి హరీష్ దులానీకి సమ్మన్లు జారీ చేయాలని కోరుతూ సల్మాన్‌ఖాన్ ఏప్రిల్ 7వ తేదీన దాఖలు చేసిన దరఖాస్తును ఛీఫ్ మెజిస్ట్రేట్ తిరస్కరించారు. కృష్ణ జింకల వేట కేసులో దులానీ ప్రధాన సాక్షి అని భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్ జింకలను చంపుతుండగా చూశానని చెప్పిన దులానీ తర్వాత మాట మార్చినట్లు భావిస్తున్నారు. ఒక టీవీ న్యూస్ ఛానల్‌లో దులానీ ప్రకటన చేసిన నేపథ్యంలో దులానీ నుంచి తాజాగా వాంగ్మూలం తీసుకోవాలని కోరుతూ సల్మాన్ న్యాయవాది కోర్టులు పిటిషన్ పెట్టుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!