బాబ్లీని చర్చలతో పరిష్కరించుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించాలని కోరుతూ నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆ సూచన చేసింది. ప్రధాని వద్ద ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర జలవనరుల మంత్రి సైఫుద్దీన్ సోజ్‌కు సూచించింది. కేసును మే 8వ తేదీకి వాయిదా వేసింది.
కొల్లేరు పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయమాయి. ఈ నెల 20వ తేదీ నుంచి చేపల చెరువుల విధ్వంసానికి పనులు చేపట్టవచ్చునని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ విషయంలో ఎవరికీ ఏ విధమైన మినహాయింపులు లేవని స్పష్టం చేసింది. అయితే ఈ నెల 20వ తేదీ లోగా రైతులు చేపలను తీసుకుపోవచ్చునని తెలియజేసింది. కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టిన కేసును సుప్రీంకోర్టు పునర్విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి మే 13 లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరు చరితారెడ్డిని, గౌరు వెంకటరెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణను జులై 3వ వారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications
