రోశయ్య తప్పుకోవాలి: టిడిపి డిమాండ్
హైదరాబాద్: చికన్‌గున్యా వ్యాధిని అరికట్టలేని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య రాజీనామా చేయాలని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉపనాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. చికన్‌గున్యా వ్యాధిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో లక్షల మంది చికన్‌గున్యా వ్యాధి బారిన పడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చికన్‌గున్యా వ్యాధి విపరీతంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందని, అయినా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
