విశాఖ-1 పోలింగ్: టిడిపి కార్యకర్తల ధర్నా
విశాఖపట్నం: విశాఖపట్నం -1 శాసనసభా నియోజవకర్గం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య వివాదం చెలరేగింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు కర్రి సీతారామ్ ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపిస్తూ తెలుగుదేశం కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఓడిపోతామనే భయంతోనే తెలుగుదేశం వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని, తనకేమీ తెలియదని కర్రి సీతారామ్ అంటున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కర్రి సీతారామ్‌పై చర్య తీసుకోలేదని తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణరాజు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
విశాఖ - 1 ఉప ఎన్నిక పోలింగ్ సోమవారంనాడు మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు కేవలం 21 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మధ్యతరగతి ప్రజలు ఓటింగ్ పట్ల నిరాసక్తత ప్రదర్శించారు. పేద వర్గాల ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications