ప్యాకేజీకి గంగవరం బాధితుల తిరస్కారం

విశాఖపట్నం: ప్రభుత్వం ప్రకటించిన కొత్త పునరావాస ప్యాకేజీని కూడా గంగవరం మత్స్యకారులు తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చెక్కులను వారు తీసుకోవడానికి నిరాకరించారు. తమ నాయకుల అరెస్టులకు నిరసనగా మత్స్యకారులు పోర్టు పనులు ఆపడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మళ్లీ మత్స్యకారుల అరెస్టులు మొదలయ్యాయి.

గంగవరం మత్స్యకారుల సమస్యలపై ఏకపక్షంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం విజయవాడలో అన్నారు. అరెస్టులు చేయడం ద్వారా కాకుండా చర్చల ద్వారా వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. జెట్టీ నిర్మాణ ప్రదేశంపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఉపాధి కల్పన విషయంలో కూడా వారు వ్యతిరేకంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+