కాంగ్రెస్‌తో పొత్తుకు సిపిఐ సిద్ధం
విజయవాడ: వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి సిపిఐ సిద్ధమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విజయవాడలో తెలిపారు. సిపిఎంతో సీట్ల సర్దుబాటు విషయాన్ని సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మే నెల 14 నుంచి 16 వరకు జరుగనున్న రాష్ట్ర స్ధాయి సమావేశాల్లో స్ధానిక సంస్ధల పొత్తులపై తుది నిర్ణయం తీసుకోనున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్ధితుల్లోనూ పొత్తు పెట్టుకోబమని ఆయన వెల్లడించారు. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్ల, అవి సుప్రీంకోర్టులో నిలబడవని తాము ముందే ఊహించామని నారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications