టీవీ ఛానల్‌పై మంత్రి దివాకర్‌రెడ్డి క్రిమినల్ కేసు
హైదరాబాద్: ఒక ప్రైవేట్ టివి న్యూస్ ఛానల్‌పై మంత్రి జెసి దివాకరరెడ్డి తాడిపత్రి కోర్టులో కేసు వేశారు. తన వ్యాఖ్యలు వక్రీక రించి ఆ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిందని, దీంతో ఎంతో ప్రజాభిమానం ఉన్న తనకు పరువునష్టం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4.40గంటలకు ఆయన తాడిపత్రి కోర్టుకు వచ్చి మేజిస్ట్రేట్‌కు ఈ విష యమై ఫిర్యాదు చేశారు. మార్చి 18న ఆ న్యూస్ ఛానల్‌లో మీడియాపై మంత్రి జెసి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రసారమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రికి వ్యతి రేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
ఆ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వార్తలు 1984నుంచి తాడిపత్రి నుంచి శాసనసభ్యుడిగా వరుసగా ఎన్నికవుతున్న తనకు తీవ్ర మన స్తాపాన్ని కలిగించాయని దివాకర్‌రెడ్డి అన్నారు. ఆ రోజు వెలంకూరు గ్రామానికి చెందిన రాజేంద్రరెడ్డి హత్య జరిగిన తర్వాత మీడి యా ప్రతినిధులు తనవద్దకు వచ్చారని, ఈ హత్య గురించి తనకు మీడియా ద్వారానే తెలిసిందని చెప్పానని, ఈ హత్యను తాను ఖండించానని, అయితే ప్రసారంలో మాత్రం వేరేగా చూపించారన్నారు. అందుకే ఆ ఛానల్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశానన్నారు. పిటిషన్‌ను పరిశీలించిన మేజిస్ట్రేట్ వేణుగోపాల రావు విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేశారు. మీడియా ప్రతినిధులు తనకు మంచి మిత్రులేనని, అయితే తన వ్యాఖ్యలు వక్రీకరించి ప్రసారం చేయడం బాధాకరమని మంత్రి జెసి దివాకరరెడ్డి పేర్కొ న్నారు.శుక్రవారం తాడిపత్రి కోర్టులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆ టీవి ప్రసారాలు చూసిన తాను అవాక్కయ్యానని చెప్పారు.












Click it and Unblock the Notifications