2011 వరల్డ్ కప్ క్రికెట్ భారత్‌లో జరగొచ్చు: బింద్రా
న్యూఢిల్లీ: క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు 2011లో భారత్‌లో జరిగే అవకాశాలున్నాయని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు శనివారం ఇక్కడ చెప్పారు. రొటేషన్ విధానం ప్రకారం భారత్‌కు ఈ అవకాశం దక్కనుందని బిసిసిఐ మార్కెటింగ్ కమిటీ సభ్యుడు ఐఎస్ బింద్రా చెప్పారు. 1987 లో భారత్ ప్రపంచ క్రికెట్ కప్ పోటీలను నిర్వహించిందని, 1996లో పాకిస్ధాన్ నిర్వహించిందని ఈ రొటేషన్ విధానంలో 2011లో మళ్ళీ భారత్‌కు అవకాశం దక్కుతుందని ఆయన తెలిపారు. దీని గురించి బహిరంగ చర్చ అవసరం లేదని, నాలుగు బోర్డులు సమావేశమై నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications