భారీగా ఐఎయస్, ఐపియస్‌ల బదిలీలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యెత్తున పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా దాదాపు 57 మంది ఐ ఎయస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో 12 మంది జిల్లా కలెక్టర్లున్నారు. హైదరాబాద్ కలెక్టర్‌గా చంద్రవదన్‌ను నియమించారు. దీనికి తోడు పది మంది ఐపియస్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, కొంత మంది ఐ ఎయస్ అధికారుల పనితీరు పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గత కొద్ది కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలన్నీ జరిగాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రజాపథం కార్యక్రమంలో కొంత మంది అధికారులు చురుగ్గా పాల్గొనలేకపోయారనే అసంతృప్తిని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రైతులు తమ కరెంట్ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకునేలా చైతన్యవంతులను చేయడంలో కూడా కొంత మంది కలెక్టర్లు విఫలమయ్యారని రాజశేఖర రెడ్డి భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
