మంత్రివర్గం సమైక్యాంధ్ర వైపే: కోనేరు రంగారావు
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సమైక్యాంధ్రనే కోరుకుంటోందని మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు అన్నారు. తెలంగాణ శాసనసభ్యులు కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, ఈ విషయంలో విభేదాలు లేవని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
సమైక్యాంధ్రలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, తెలంగాణలో పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందాయని, సమైక్యాంధ్రలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు. మూడేళ్ల తర్వాత తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
