సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం: చంద్రబాబు
హైదరాబాద్: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని, గ్రూపు తగాదాలు లేవని ఆయన శుక్రవారుం మీడియా ప్రతినిధులతో అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో యువతకు 35 శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసినదాని కన్నా ఎక్కువే చేస్తామని ఆయన చెప్పారు. ఉచిత విద్యుత్ సరఫరాతోనే రైతుల కష్టాలన్నీ తీరిపోవని, మరిన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
