పంచాయతీ ఎన్నికల తర్వాత విస్తరణ: సియం
న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి చెప్పారు. సమైక్యాంధ్ర విషయంలో తనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి తోడ్పాటు వద్దని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వేర్పాటు కూడా వద్దని ఆయన అన్నారు. అయితే తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తనకు శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై అధిష్ఠానం తన అభిప్రయాన్ని అడిగితే చెప్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
