మూడేళ్ల దాకా తెలంగాణ తేలదు: పాల్వాయి
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం మరో మూడేళ్ల దాకా ఏమీ తేలదని తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వుండడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి తెలంగాణ అంశం తేల్చకపోతే కాంగ్రెస్‌కు తిప్పలు తప్పవని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు న్యాయం జరగదనే నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటును కాదనరని, అయితే తన వ్యక్తిగతాభిప్రాయం చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
