షార్ సెంటర్ వద్ద వ్యక్తి అరెస్టు, కేసు నమోదు
నెల్లూరు: నెల్లూరు సమీపంలోని శ్రీహరికోట షార్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న షకీల్ అహ్మద్ అనే వ్యక్తిని సిఐయస్‌ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. షకీల్ అహ్మద్‌ను ఐయస్‌ఐ ఏజెంటుగా అనుమానిస్తున్నారు. అతనిపై 397 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో జరిగిన షార్ప్ భవనం పేల్చివేతకు సంబంధించిన కీలక పత్రాలను సిఐయస్‌యఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కీలకమైన పత్రాలను షకీల్ అహ్మద్ విదేశాలకు చేరవేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అతను ముత్తకూరు మండలం బ్రహ్మదేవం గ్రామానికి చెందినవాడు. అయితే పేరు కూడా రాయలేని తన కొడుకు కీలకపత్రాలను విదేశాలకు చేరవేసే దేశద్రోహానికి ఎలా పాల్పడగలడని షకీల్ అహ్మద్ తల్లి ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications
