తెలంగాణపై సోనియాదే తుది నిర్ణయం: వైఎస్
న్యూఢిల్లీ: తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఎవరేమి మాట్లాడినా అంతిమ నిర్ణయం సోనియాగాంధీదేనని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాంగాంధీని శుక్రవారం మధ్యాహ్నం కలుసుకునే అవకాశముంది. తెలంగాణ అంశంపైనే ఉభయులూ చర్చిస్తారని ఇక్కడి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరక్క టిఆర్‌ఎస్ అగ్రనాయకులు చంద్రశేఖరరావు, నరేంద్ర గత నాలుగైదు రోజులుగా పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరితో కూడా సోనియాగాంధీ నేడు సమావేశమయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications
