తెలంగాణవాదులంతా ఏకం కావాలి: తెరాస
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రవాదులంతా ఏకమవుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణవాదులంతా ఏకం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్‌కుమార్ సూచించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ నేతలు కె. చంద్రశేఖర రావు, నరేంద్రలపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చింది తమ పార్టీయేనని, అటువంటి పార్టీ నేతలపై బిజెపి విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు. తమ నేతలపై బిజెపి నాయకులు వాడిన భాష సరైంది కాదని ఆయన అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని నినాదమిచ్చిన బిజెపి ఎందుకో గానీ తెలంగాణ అంశాన్ని వదిలేసిందని, అటువంటి సందర్భంలో ఐదేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ అంశాన్ని ఢిల్లీ దాకా తీసుకువచ్చిన తమపై విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
