హైదరాబాద్‌లో మరో భారీ చోరీ
హైదరాబాద్: జరిగింది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గల భాను అపార్ట్‌మెంటులో 42 లక్షల రూపాయల చోరీ జరిగింది. రవీందర్ అనే డాక్టర్ అవసరం నిమిత్తం బ్యాగులో డబ్బు తెచ్చి దాన్ని హాల్‌లోనే పెట్టారు. ఈ మేరకు రవీందర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి నిద్ర పోయేటప్పుడు బ్యాగును హాల్‌లోనే పెట్టామని, అయితే తెల్లారి లేచేసరికి బ్యాగు లేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రి నిద్ర పోయేటప్పుడు ముందు డోర్ లాక్ చేశామని, వెనక డోర్ లాక్ చేయలేదని ఫ్లాట్ యజమాని సత్యవతి చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చోరీ విషయంలో తమకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. డబ్బులున్న బ్యాగును కనీసం బీరువాలోనైనా పెట్టకుండా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పోలీసులకు అనుమానాలు రేకెత్తినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
