సమ్మె విరమించండి: మెడికోలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: వెంటనే సమ్మె విరమించి, వైద్య సర్వీసుల్లో చేరాలని సుప్రీంకోర్టు మంగళవారంనాడు వైద్య విద్యార్థులను ఆదేశించింది. వైద్య విద్యార్థుల సమస్యలను తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. సమ్మె విరమిస్తే ప్రభుత్వం విద్యార్థుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తుందని, ఏ విధమైన కక్షసాధింపు చర్యలు తీసుకోదని స్పష్టం చేసింది.
ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగాలను కూడా వెనక్కి పిలవాలని, విధుల్లో చేరడానికి వారికి మూడు రోజుల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులు, ప్రభుత్వ విధానం వల్ల నష్టపోతున్నామనుకుంటున్నవాళ్లు ఎవరైనా రిట్ పిటిషన్స్ వేయవచ్చుని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమ్మెను కొనసాగిస్తే ఫలితం ఉండదని, పైగా రోగులకు అసౌకర్యం కలుగుతుందని సుప్రీంకోర్టు అన్నది. వైద్య విద్యార్థుల సమ్మెపై ప్రభుత్వం రేపు కోర్టుకు నివేదిక సమర్పిస్తుంది. సమ్మె విరమించాలని, లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి అంబుమణి రామదాస్ హెచ్చరించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో ఆయన బుధవారంనాడు రోగులను పరీక్షించారు.












Click it and Unblock the Notifications
