వెంకటస్వామితో నరేంద్ర తెరాస విలీనం మాట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైతే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత ఎ. నరేంద్ర తనతో చెప్పినట్లు కాంగ్రెస్ సినీయర్ నేత, పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు జి. వెంకటస్వామి చెప్పారు. తెరాస నేతలు నరేంద్ర, వినోద్‌కుమార్ బుధవారం వెంకటస్వామిని కలిసి ఆయనతో మాట్లాడారు. నరేంద్రతో తాను కాంగ్రెస్‌లో తెరాస విలీనం గురించి ప్రస్తావించానని ఆయన చర్చల అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం గురించి తెరాసలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని నరేంద్ర చెప్పారని ఆయన తెలిపారు.
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని తాము ఎప్పుడూ చెప్పలేదని వెంకటస్వామితో చర్చల అనంతరం నరేంద్ర మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. వెంకటస్వామితో పొత్తు అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. చర్చలో వెంకటస్వామి అభిప్రాయం వెంకటస్వామి చెప్పారని, తమ అభిప్రాయం తాము చెప్పామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
