తెలంగాణపై ఏమీ మాట్లాడను: వైయస్
ఏలూరు: తెలంగాణపై తానేమీ మాట్లాడబోనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన బుధవారంనాడు కూడా పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లకూరులో ఆయన పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్లేరు ప్రజల పునరావాసం కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే బిసి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. ఓటమి భయంతో తెలుగుదేశం నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జల్లా శాసనసభ్యులతో ఆయన సమీక్ష జరిపారు. ఇందిరా క్రాంతి పథకం కింద దేవాదాయ భూముల కేటాయింపుపై చట్ట ప్రకారం నడుచుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
