వామపక్షాలతో పొత్తులకు సిద్ధం: చంద్రబాబు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో వామపక్షాలతో పొత్తులకు తాము సిద్ధమేనని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ ఆయన చెప్పారు. పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వామపక్షాలతో రాష్ట్ర స్థాయిలో పొత్తులపై ఆలోచన చేస్తామని, వామపక్షాలు ముందుకు వస్తే ఆ విషయమై పార్టీలో చర్చిస్తామని ఆయన చెప్పారు.
స్థానికంగా అక్కడక్కడా తమ పార్టీ నాయకులు వామపక్షాలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే పొత్తులున్నా లేకున్నా తమ పార్టీ గతంలో గెలిచిందని, భవిష్యత్తులోకూడా గెలుస్తుందని ఆయన అన్నారు. వామపక్షాలు పొత్తులకు ముందుకు వస్తే ఆలోచిస్తామని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను కార్యకర్తలు స్థానికంగానే ఎంపిక చేసుకుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
