భాషా శాస్త్రవేత్త బూదరాజు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ ఆదివారం నాడు కన్ను మూశారు. ఆయనకు 75 ఏళ్లు. ఆయన 1932 మేలో ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించారు. ఆయన గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. బూదరాజు రాధాకృష్ణ వివిధ కాలేజీల్లో అధ్యాపకులుగా పని చేశారు. తెలుగు అకాడమీ ఉప సంచాలకులుగా పని చేశారు.
ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్‌గా పని చేశారు. తెలు భాషా పదకోశాన్ని, వ్యవహారిక తెలుగు భాషా పదకోశాన్ని, ఈనాడు వ్యవహారిక భాషా పదకోశాన్ని ఆయన రూపొందించారు. తెలుగు పత్రికా భాషకు ఒక రూపాన్ని ఇచ్చినవారిలో ఆయన మొదటి వరుసలో ఉంటారు. ఆయన జీవిత చరిత్ర ఇటీవల ప్రచురితమైంది. ఆయన పలు వ్యాసాలు కూడా రాశారు.












Click it and Unblock the Notifications
