అప్పుడే సీట్ల కోసం కాంగ్రెస్ మిత్రుల పట్టు
హైదరాబాద్: పొత్తులు ఖరారు కాకముందే మిత్రపక్షాలు సీట్లపై కాంగ్రెస్ ముందు డిమాండ్లు పెడుతున్నాయి. తమకు తెలంగాణలో 40 శాతం సీట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. తమకు నాలుగు జిల్లా పరిషత్‌లు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.
పొత్తులు రాష్ట్ర స్థాయిలోనే ఖరారు కావాలని, అలా ఖరారయినప్పుడే జిల్లా స్థాయిలో సమన్వయం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము స్నేహపూర్వక పోటీకి కూడా సిద్దంగానే ఉన్నామని ఆయన చెప్పారు. తమకు నల్లగొండ, ఖమ్మం జిల్లా పరిషత్‌లు ఇవ్వాలని సిపిఐ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మరో మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ను కోరారు. ఈ జిల్లాలో సిపియంకు బలం ఉన్నా తమ రాష్ట్ర స్థాయి బలాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ స్థానాలు కేటాయించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
