ఓడితే తెరాసకు కార్యకర్తలుండరు: కాంగ్రెస్
హైదరాబాద్: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓడిపోతే ఆ పార్టీ కార్యకర్తలు పూర్తిగా తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా తెరాస నాయకులు తమ వైఖరి మార్చుకోలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస నాయకులు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని, తామే తెలంగాణ తెస్తామని నమ్మించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసమే తెరాసలో ఉన్న కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్‌లోకి వస్తారని ఆయన అన్నారు. ఆ స్థితి వస్తే తెరాస నాయకులు తమను అనడం వల్ల ఫలితం ఏదీ ఉండదని, అందుకు బాధ్యత తెరాస నాయకులే వహించాల్సి వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
