ఏ క్షణంలోనైనా తెలంగాణ ప్రకటన: నరేంద్ర
మెదక్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. తెలంగాణపై ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ విధాన ప్రకటన చేయడంలో, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడంలో మాత్రమే ఆలస్యమవుతోందని ఆయన అన్నారు. వారం, పది రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణను వ్యతిరేకిస్తే రాజీనామా చేయడానికి తమ లేఖలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని తాము పార్లమెంటులో సమర్పిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
