సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: వైయస్
చిత్తూరు/అనంతపురం: సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. గాలేరు - నగరి ప్రధాన కాలువ రెండో దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. హంద్రీ - నీవా రెండో దశ పనులకు ఆయన ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదిరాళ్లు సమాధి రాళ్లుగా మారాయని ఆయన విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో సాధిస్తామని ఆయన చెప్పారు. పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను అన్నింటినీ తమ హయాంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. తాము సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
