బల్దియా నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బలి
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ (యంసిహెచ్) నిర్లక్ష్యానికి హైదరాబాద్‌లో మరో నిండు ప్రాణం బలైంది. రాత్రి కురిసిన వర్షానికి మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఒక వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన సైదాబాద్‌లోని సరస్వతీనగర్‌లో జరిగింది. రాత్రి కురిసిన వానకు రోడ్డుపై పెద్ద యెత్తున నీరు నిలిచిపోయింది. ఆ నీటిలో నడుస్తూ ఒక వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.
మ్యాన్‌హోల్‌లో పడిన వ్యక్తి శవం ఆదివారం ఉదయం బయట పడింది. అతనెవరైందీ గుర్తు పట్టలేదని సైదాబాద్ సైదాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ చెప్పారు. అతనికి దాదాపు 55 యేళ్లుంటాయని చెప్పారు. వర్షం పడిన ప్రతిసారీ హైదరాబాద్‌లో ఏదో ఒక చోట మ్యాన్‌హోల్‌లో పడి మరణాలు సంభవించడం ఆనవాయితీగా మారింది. అయినా నగరపాలక సంస్థ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.












Click it and Unblock the Notifications
