మూడో ఫ్రంట్ కాదు, ప్రత్యామ్నాయం: ఏచూరి
విజయవాడ: తాము మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నం చేయడం లేదని, మూడో ప్రత్యామ్నాయం కోసమే ప్రయత్నిస్తున్నామని సిపియం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఫ్రంట్‌కు, ప్రత్యామ్నాయానికి మధ్య చాలా తేడా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం ఏర్పడాలనేది తమ ప్రయత్నమని ఆయన అన్నారు.
మతోన్మాదాన్ని వ్యతిరేకించే విషయంలో, ఆర్థిక విధానాలపై మూడో ప్రత్యామ్నాయం కోసం రాజకీయ పార్టీలు కలసి వస్తాయని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాల ప్రాతిపదిక మీదనే మూడో ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే క్రమంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
