ప్రణబ్ కారుకు అడ్డం పడ్డ ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు
కోల్‌కత్తా: నేతాజీ మరణంపై విచారణ జరిపిన ముఖర్జీ కమిటీ నివేదికపై పార్లమెంటులో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు ఆదివారంనాడు రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కారును అడ్డుకున్నారు. మర్చంట్ ఛేంబర్ ఆప్ కామర్స్ 105వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించడానికి ప్రణబ్ తాజ్ బెంగాల్ హోటల్‌కు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
హోటల్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఒక్కసారిగా మంత్రి కారుకు అడ్డం పడ్డారు. మంత్రి భద్రతాసిబ్బంది ఆందోళనకారులను పట్టుకుని పక్కకు నెట్టేశారు. ఈ సమయంలో స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం నివేదికను పార్లమెంటులో చర్చకు పెట్టిందని, అయితే బిజెపి చర్యల వల్ల చర్చ జరగలేదని ప్రణబ్ ముఖర్జీ మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications
