ఉల్లంఘనపై కమీషన్ నిస్సహాయతా?: టిడిపి
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నియమావళి ఉల్లంఘనపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిస్సహాతయ వ్యక్తం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల నియమాళి ఉల్లంఘనపై కమీషన్ నిస్సహాయత వ్యక్తం చేయడాన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నియమావళిని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమీషన్‌ను కోరారు.
ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికలను నిష్పాక్షికంగా, నిర్భయంగా నిర్వహించాలని ఆయన ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి అమలుకు సహకరించడం లేదని ఎన్నికల కమీషన్ వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తేటతెల్లమవుతోందని ఆయన అన్నారు. నియమావళిని కచ్చితంగా అమలు చేయని అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన ఎన్నికల కమీషన్‌ను కోరారు.












Click it and Unblock the Notifications
