రాజభవన్ వద్ద బిజెపి ధర్నా: ఉద్రిక్తత
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) మంగళవారం రాజభవన్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. బిజెపి కార్యకర్తలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాజభవన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నుంచి రాజభవన్ వరకు బిజెపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
రాజభవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో బిజెపి కార్యకర్తలు రాజభవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి, శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. నాయకులతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది.












Click it and Unblock the Notifications
