టిడిపి, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ: నాగంపై కేసు
మహబూబ్‌నగర్: నామినేషన్ల పరిశీలన సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయం వద్ద మంగళవారం ఘర్షణ చెలరేగింది. బిజినేపల్లి మండలం వెనుకొండ మండల పరిషత్ ప్రాదేశిక కమిటీ (యంపిటిసి) నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. ఆర్డీవో చర్యను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆర్డీవో కార్యాలయం నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. నాగం జనార్దన్ రెడ్డిపై, ఆయన అనుచరులపై ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగం జనార్దన్ రెడ్డిపై, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications
