సిపిఐ, తెరాసలకు ఎక్కువ సీట్లే ఇచ్చాం: కెకె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఐలకు వాస్తవ పరిస్థితి కన్నా ఎక్కువ సీట్టే ఇచ్చామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. సర్వేలో వాస్తవ పరిస్థితి తెలిసిన తర్వాతనైనా ఆ రెండు పార్టీలు పట్టువిడుపులతో వ్యవహరించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెరాసకు 29, సిపిఐకి 26 జడ్‌పిటిసి స్థానాలు వస్తాయని సర్వేలో తేలిందని, తాము నిర్వహించే సర్వేలో ఆ విషయం తేలిందని, అందుకు మూడింతల సీట్లు ఆ రెండు పార్టీలకు ఇచ్చామని ఆయన అన్నారు.
శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి జడ్‌పిటిసి, ఎంపిటిసి సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి అనుచరులు మంగళవారం గాంధీభవన్ ముందు ధర్నా చేశారు. వారిని పిలిచి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తానని కేశవరావు హామీ ఇచ్చారు. ఆ తర్వాత మల్‌రెడ్డి రంగారెడ్డి అనుచరులు గాంధీభవన్‌కు వచ్చి సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలను కేశవరావు సముదాయించే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications
