అక్షరథామ్ కేసులో ముగ్గురికి మరణ శిక్ష
అహ్మదాబాద్: అక్షరథామ్ కేసులో పోటా కోర్టు ముగ్గురికి మరణశిక్షను విధించింది. ఈ కేసులో ఆరుగురిని కోర్టు దోషులుగా గుర్తించింది. 2002 సెప్టెంబర్ 24లో జైషే మహ్మద్ తీవ్రవాదులు గాంధీనగర్‌లోని అక్షరథామ్‌పై దాడి చేసి 34 మందిని హతమార్చారు. వీరిలో ఎన్.ఎస్.జి. కమాండర్ కూడా ఒకరు ఉన్నారు. ఈ నేపథ్యంలో జమ్ము, కాశ్మీర్ పోలీసులు ఈ దాడికి వ్యూహకర్త అయిన చాంద్ ఖాన్ అనే తీవ్రవాదిని అరెస్టు చేసి, అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించాయి. క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా దాడిలో సహకరించారనే ఆరోపణపై ఐదుగుర్ని అరెస్టు చేశారు. వీరిని విచారించిన పోటా కోర్టు శనివారం నాడు ముగ్గురిని ప్రధాన నిందితులుగా పేర్కొంటూ వారికి మరణశిక్షను విధించింది. మరో ఇద్దరికి పదేళ్ళు, ఒకరికి ఐదేళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.












Click it and Unblock the Notifications
